మెగాస్టార్ చిరంజీవి నేడు తన 69వ జన్మదినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నటుడిగా ఇంకా కెరీర్ పరంగా ఒక్కో సినిమాతో మరింత మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు మెగాస్టార్. అయితే ఇటీవల వచ్చిన భోళా శంకర్ బాగా నిరాశపరచడంతో ప్రస్తుతం వశిష్టతో చేస్తోన్న విశ్వంభర మూవీతో భారీ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ దీనిని గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రాఫర్. కాగా నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. త్రిశూలం పట్టుకుని పవర్ఫుల్ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి ఈ రోజు విశ్వంభర నుండి ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అందరూ భావించారు, అయితే దానికి సంబంధించి ఇంకా కొంత వర్క్ బ్యాలన్స్ ఉండడంతో కొన్నాళ్ళు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2025 జనవరి 10న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.