టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీలకపాత్రల్లో సురభి, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాస్తవానికి 2025 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది, కానీ అదే సమయానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండడంతో విశ్వంభరని కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది మే 9న ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఇదే డేట్ న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పటి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా రిలీజ్ అయింది. అందుకే ఈ స్పెషల్ డేట్ రోజునే తమ మూవీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిందట విశ్వంభర టీమ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లింక్స్ టీజర్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.