మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ తెలిపారు.
ఇక మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి రానున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
మ్యాటర్ ఏమిటంటే, లేటెస్ట్ టాలీవడ్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుండగా మెగాస్టార్ విశ్వంభర మూవీ మరొక రెండు నెలలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది.