Homeసినిమా వార్తలు'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్ ?

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్ ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా విశ్వంభర. ఈ మూవీపై మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల విశ్వంభర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందర్నీ ఆకట్టుకోగా అందులోని విజువల్ ఎఫెక్ట్స్ పై మాత్రం విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక నేడు ఈ మూవీ నుంచి రామ రామ అనే పల్లవి తో సాగే సాంగ్ ని హనుమాన్ జయంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తప్పకుండా ఈ పాట అందర్నీ ఆకట్టుకుని రేపు థియేటర్స్ లో కూడా అలరిస్తుందని చెప్తుంది యూనిట్. 

ఇక ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి జులై 24న గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే విశ్వంభర నుండి ఒక్కొక్కటిగా మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో భీమవరం దొరబాబు అనే మాస్ ఎంటర్టైనింగ్ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి విజయవంతం చూడాలి

READ   'గుడ్ బ్యాడ్ అగ్లీ' బాక్సాఫీస్ కలెక్షన్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories