మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం, చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
యువి క్రియేషన్స్ సంస్థ పై వంశి, ప్రమోద్, విక్రమ్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. విషయం ఏమిటంటే, నేడు తమ విశ్వంభర మూవీ యొక్క డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. అలానే మరోవైపు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతోందని వారు తమ పోస్ట్ లో తెలిపారు.
దాదాపుగా రూ. 200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, సురభి, ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీలో భీమవరం దొరబాబు పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా ఆయన పాత్ర మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందట. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి విశ్వంభర మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.