మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. యువి క్రియేషన్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, సురభి పురాణిక్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ జానర్ లో గ్రాండ్ గా రూపొందుతోన్న విశ్వంభర నుండి ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ అవుతుందని భావించారు, అయితే కొన్ని కారణాల వలన అది సాధ్యపడలేదు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని రానున్న దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు చెప్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ అనౌన్స్ మెంట్ అందించనున్నారట. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి విశ్వంభర మూవీని 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.