మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో భీమవరం దొరబాబుగా మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైనింగ్ పాత్ర చేస్తున్నారు చిరంజీవి.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ వాస్తవానికి ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది. అయితే మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ అదే సమయంలో రానుండడంతో పాటు తమ మూవీకి సంబంధించి మరికొంత పెండింగ్ వర్క్ ఉండడంతో విశ్వంభర టీమ్ తమ రిలీజ్ ని వాయిదా వేసుకుంది.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా ఓటిటి డీల్ సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ కొనేందుకు సందేహిస్తున్నట్లు టాక్. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన విశ్వంభర ఫస్ట్ లుక్ టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు.
కాగా ఈ మూవీ ఓటిటి డీల్ కుదరనిదే థియేటర్స్ రిలీజ్ ఫిక్స్ కాదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో తేడా వస్తే నిర్మాతలు, బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ఇక విశ్వంభర మూవీలో ఇటీవల కీరవాణి కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ ని టీమ్ గ్రాండ్ గా చిత్రీకరించింది. మరి పక్కాగా విశ్వంభర ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.