Homeసినిమా వార్తలుVishwambhara Big Test for Vasishtha 'విశ్వంభర' : వశిష్టకు పెద్ద పరీక్షే 

Vishwambhara Big Test for Vasishtha ‘విశ్వంభర’ : వశిష్టకు పెద్ద పరీక్షే 

- Advertisement -

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్నారు. 

ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా దసరా పండుగని పురస్కరించుకుని విశ్వంభర నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈ టీజర్ పై భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అసలు బాగోలేవని అలానే పలు హాలీవుడ్ చిత్రాల లోని సీన్స్ ని కాపీ చేసి ఈ టీజర్ రూపొందించారనేది అనేకులు చేస్తున్న విమర్శ. 

ఒకరకంగా ఇది విశ్వంభర దర్శకుడు వశిష్ఠ కు పెద్ద పరీక్ష అని చెప్పాలి. దాదాపుగా పదిహేను రోజులు కష్టపడి తాను ఈ టీజర్ ని కట్ చెసానిని చెప్పారు వశిష్ట. మరి ఇంత భారీ స్థాయిలో టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ పై ట్రోల్స్ వస్తుండడంతో రాబోయే రోజుల్లో వాటిపై మరింత శ్రద్ధ తీస్కోవాసి ఉంది. ఇక ఈ మూవీ రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు టీమ్ విజువల్ ఎఫెక్ట్ విషయమై మరింత శ్రద్ధ తీసుకునే అవకాశం కనపడుతోంది. 

READ  Koratala Siva in Dilemma 'దేవర - 2' : డైలమాలో కొరటాల శివ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories