Home సినిమా వార్తలు Das Ka Dhamki: విశ్వక్ సేన్ యొక్క దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే ఫస్ట్...

Das Ka Dhamki: విశ్వక్ సేన్ యొక్క దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ – రివ్యూ – రేటింగ్ మరియు బాక్సాఫీస్ అంచనా

విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన దాస్‌ కా ధమ్కీ చిత్రం ఈరోజు విడుదలైంది. కాగా ఈ చిత్రానికి విశ్వక్‌ సేన్‌ ఏ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఉగాది పండుగ రోజు విడుదల కావడం వల్ల సహజంగానే బాక్సాఫీసు ప్రయోజనాన్ని కలిగి ఉంది మరియు సినిమాకు గనక ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను వస్తే, అది ఖచ్చితంగా ఈ యువ నటుడు/దర్శకుడికి కెరీర్-బెస్ట్ నంబర్‌లను అందించగలదు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఇక ఈ సినిమా టాక్‌కి వస్తే, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు పాటలు వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని టాక్ వినిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగా వచ్చిందనీ.. అయితే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అదే ఊపు కొనసాగలేదు అని సినిమా చూసిన వారు అంటున్నారు.

సెకండ్ హాఫ్ లో కొన్ని ఊహించదగిన మలుపులు మరియు గందరగోళ స్క్రీన్‌ ప్లే ఉండడం వల్ల మొత్తంగా సినిమా ప్రభావాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. మొత్తం మీద, దాస్ కా ధమ్కీ మంచిగా రూపొందించబడిన చిత్రమే అయినా, కొన్ని సన్నివేశాలను సరిగా హ్యాండిల్ చేయలేదని, అయితే ఈ సినిమాని ఖచ్చితంగా ఒక సారి వీక్షించవచ్చు అని ప్రేక్షకులు అంటున్నారు.

దాస్ కా ధమ్కీ థియేట్రికల్ రైట్స్ రూ. 8కోట్లకు అమ్ముడయ్యాయి మరియు హాలిడే అడ్వాంటేజ్ కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రేపు మరియు శుక్రవారాలు వారాంతపు రోజులు కావడంతో అదే హోల్డ్‌ను కొనసాగించడం అంత సులభం కాదు. ఈ వారం ఇతర సినిమాలు ఏవీ విడుదలకు సిద్ధంగా లేవు.

ఇది ఖచ్చితంగా దాస్‌ కా ధమ్కీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షించడం అంత సులభం కాదు. ముందస్తు అంచనాల ప్రకారం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవచ్చు అంటున్నారు. మరి విశ్వక్ సేన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ఆగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version