సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టి, ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పట్టును కనబరిచి సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో అద్భుతమైన వీకెండ్ ను పొంది 100 కోట్ల మార్కును దాటేందుకు సిద్ధం అవుతోంది.
విరూపాక్ష గత రాత్రి షోల నుండి కలెక్షన్లలో పెరుగుదలను పొందడం ప్రారంభించింది మరియు కొత్తగా విడుదలయిన సినిమాలకు పేలవమైన సమీక్షలు వచ్చిన కారణంగా ఈ రోజు మధ్యాహ్నం షోలు కూడా సంచలన స్థాయిలో వసూళ్లు సాధించాయి. విరూపాక్ష ఇప్పుడు ఈ వీకెండ్ లో ప్రేక్షకులకు నెం.1 ఛాయిస్ గా మారింది. ఇక సోమవారం కూడా సెలవు దినం కావడం ఈ సినిమాకు సహాయపడుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
విరూపాక్ష కథ ఏమిటంటే సూర్య అనే యువకుడు తన కుటుంబాన్ని కలవడానికి తన తల్లితో కలిసి ఆధ్యాత్మిక గ్రామం అయినా రుద్రవనంకు వస్తాడు. అక్కడ నందిని అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వారి మధ్య ప్రేమ చిగురించడం మొదలవుతుంది, కానీ అకస్మాత్తుగా గ్రామ ప్రజలు అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. సూర్య గ్రామంలోని అనుమానాస్పద మరణాలకు కారణం ఏమిటో అన్వేషించడం ప్రారంభిస్తాడు. ఆ రహస్యాన్ని సూర్య ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అజయ్, రాజీవ్ కనకాల, సాయిచంద్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. 2023 ఏప్రిల్ 21న విరూపాక్ష థియేటర్లలో విడుదలైంది. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాల పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.