Homeసినిమా వార్తలుVirupaksha: విరూపాక్ష 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Virupaksha: విరూపాక్ష 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ఈ శుక్రవారం విడుదలై ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో పాటు మంచి రేటింగ్స్ ను సంపాదించుకుంది. అదే తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగింది. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఇండస్ట్రీ వర్గాల కోసం స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేయగా ఆ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విరూపాక్ష టీం సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ చూపించగా అది నిజమై ఇప్పుడు సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 25 కోట్లు కాగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తొలి రోజు 6.1 కోట్ల షేర్ వసూలు చేసింది. మొదటి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా వారి అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి.

విరూపాక్ష తొలి రోజు నుంచే భారీ జోరుతో అన్ని ప్రాంతాల్లో అసాధారణంగా ఉండి రెండో రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. రెండు రోజుల తెలుగు రాష్ట్రాల షేర్ సుమారు 10.5 కోట్లు, వరల్డ్ వైడ్ షేర్ సుమారు 13.5 కోట్లు కాగా, ఈ రోజు నాటికి 20 కోట్ల షేర్ మార్కును దాటుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ వీకెండ్ ను సొంతం చేసుకుంటోంది.

READ  Sukumar: విరూపాక్ష దర్శకుడి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చిన సుకుమార్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల తెలుగులోనే విడుదలైంది. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్ రచనా భాద్యతలను నిర్వర్తించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Virupaksha: సాయిధరమ్ తేజ్ విరూపాక్ష యొక్క ఇన్ సైడ్ రిపోర్ట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories