రాణా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న “విరాట పర్వం” ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతుంది. వరుసగా జరిగిన లాక్ డౌన్ ల వల్ల, షూటింగ్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న ఈ చిత్రం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్ర బృందం వీలయినంత ఎక్కువగా పబ్లిసిటి చేస్తున్నారు. కరోనా వల్ల రిలీజ్ ఆగిపోయిన చాలా సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారానికి ఒక నోటెడ్ సినిమా రిలీజ్ అవుతుంది.
ఇటీవల విడుదల అయిన “మేజర్” “చార్లీ 777” చిత్రాల మాదిరిగా “విరాట పర్వం” కూడా రిలీజ్ కు ముందే స్పెషల్ ప్రీమియర్ లు ప్రదర్శించింది. ఆ ప్రీమియర్ షో లు చూసిన వారంతా సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రాణా, సాయి పల్లవిల నటనకు అద్భుత స్పందన లభించింది అట. అలాగే దర్శకుడు వేణు ఉడుగుల రచన, దర్శకత్వ ప్రతిభ నూ సినిమా చూసిన ప్రేక్షకులు అభినందించారు అని తెలుస్తుంది. సినిమాలో ప్రియమణి,రాహుల్ రామకృష్ణ,నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.