విరాట పర్వం చిత్ర బృందం మంచి ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవలే కర్నూల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న టీమ్ ఈరోజు హైద్రాబాద్ లో మరో ఈవెంట్ నిర్వహించింది.
ఇక సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల బిజినెస్ 10.25 కోట్ల వరకూ,ఓవర్సీస్ తో కలుపుకుని 12 కోట్ల బిజినెస్ జరిగింది. ఒక రకంగా కాస్త ముందు వేనకా చూసుకునే బిజినెస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది.
సాయి పల్లవి క్రేజ్ తో పాటు రానా పవర్ఫుల్ పాత్రలో రాణించి సినిమాను హిట్ బాట పట్టిస్తారని ఆశిద్దాం.