చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ
రేటింగ్: 2.75/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, కష్మిరా పరదేశి, మురళీ శర్మ తదితరులు.
దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేదీ: 18 ఫిబ్రవరి 2023
కథ: తిరుపతిలో ఉండే విష్ణు (కిరణ్ అబ్బవరం) అందరికీ సాయం చేసే మంచివాడు. దర్శన (కశ్మీర) తన నైబర్ నంబర్ విష్ణుతో పరిచయం పెంచుకుంటుంది మరియు ఇద్దరి మధ్య స్నేహం వికసిస్తుంది. అయితే, దర్శన తన మరో నైబర్ నంబర్ అయిన శర్మ (మురళీ శర్మ) కారణంగా ఇబ్బందుల్లో పడుతుంది. ఈ ఫోన్ నెంబర్లన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయి, విష్ణు ఈ చిక్కుముడులు అన్నీ ఎలా విప్పుతాడు అనేది మిగతా కథ.
నటీనటులు: కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిగా బాగా నటించారు. అతని సున్నితమైన నటనతో పాటు మేనరిజమ్స్ కూడా సినిమా అంతటా చాలా సహజంగా కనిపించాయి. కష్మీరా పరదేశి క్యూట్ గా ఉండి తన తొలి సినిమాలో హీరోయిన్ గా మంచి నటన కనబరిచారు. ఆమెకి మంచి పాత్ర దొరికింది పైగా కథ ముందుకు సాగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మురళి శర్మ పాత్ర చాలా ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి తన నటనతో ఇండస్ట్రీలో తనకు అంత డిమాండ్ ఎందుకు ఉందో నిరూపించారు ఈ సీనియర్ నటుడు. తన పాత్రతో మంచి ఫన్, సస్పెన్స్, డ్రామా జోడించి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచారు.
విశ్లేషణ: మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన వినరో భాగ్యం విష్ణు కథ సినిమాని ఒక మల్టీ జానర్ మూవీగా పేర్కొనవచ్చు. సినిమాలో ఉన్న అనేక సబ్ ప్లాట్స్ మరియు వాటికి సంభందించిన సన్నివేశాలను తీయడంలో ఆయన చక్కగా పని చేశారు. డైలాగులు కూడా బాగా రాసుకుని సినిమాకు గొప్ప విలువను చేకూర్చారు. ఇక కొన్ని ఎలివేషన్ సీన్లను కూడా ఆయన చాకచక్యంగా నిర్వహించారు. అయితే ట్విస్టులు, పాత్రల ప్రవర్తనని ఇంకాస్త పకడ్బందీగా ఉండేలా చూసుకుని ఉంటే ఖచ్చితంగా సినిమా బలం మరింత పెరిగేది. మొత్తంగా ఈ సినిమా ఒక కొత్తదనంతో కూడిన అనుభవంగా చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్:
- ప్రధాన కథాంశం
- సంగీతం
- కొన్ని కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ కథనం
- ఊహించదగిన సన్నివేశాలు
- కొన్ని చోట్ల సిల్లీగా అనిపించే సందర్భాలు
తీర్పు: వినరో భాగ్యం విష్ణు కథ సినిమాకు ఆసక్తికరమైన కథాంశం, మురళీ శర్మ, కిరణ్ అబ్బవరం ప్రెజెన్స్ ప్లస్ అయి ఇక డీసెంట్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి. ఈ చిత్రం ఒక మంచి ప్రయత్నం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే సెకండాఫ్ లో కథనం తెలిసిన దారిలో కాకుండా కాస్త కొత్తదనం కోసం చూసి ఉంటే మరింత ఎంగేజింగ్ గా ఉండేది.. తద్వారా ఖచ్చితంగా మరో స్థాయిలో ఉండేది