Home సినిమా వార్తలు విక్రాంత్ రోణ – వాంటెడ్ పండు గాడ్ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ

విక్రాంత్ రోణ – వాంటెడ్ పండు గాడ్ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ

Vikrant Rona And Wanted Pandugadu Streaming On OTT

ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులకిదాదాపు ప్రతి శుక్రవారం అటు ధియేటర్లలో సినిమాలతో పాటు ఇటు ఓటిటిలో కూడా సినిమాలు విడుదలవుతున్నాయి. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేని దారి దానిదే అన్నట్టు ధియేటర్ ప్రేక్షకులకు కావలసిన వినోదం వారికి దక్కుతుంది అలాగే ఇంట్లో టివిలో, మొబైల్ ఫోన్లలో చూసుకునే వీలుగా ఓటిటి కంటెంట్ రూపొందుతుంది. ఈ వారం ఇది వరకే ధియేటర్లలో విడుదల అయిన రెండు సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి. రెండు చిత్రాలు కూడా కంటెంట్ పరంగా చాలా భిన్న నేపథ్యాలు కలిగిన సినిమాలు కావడం విశేషం. ఆ రెండు సినిమాలు మరెవో కాదు విక్రాంత్ రోణ మరియు వాంటెడ్ పండు గాడ్.

విక్రాంత్ రోణ ఒక యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్ అయితే, వాంటెడ్ పండుగాడు కామెడీతో మిళితమైన యాక్షన్-థ్రిల్లర్ గా తెరకెక్కింది.కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించగా.. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రాంత్ రోణకన్నడ, హిందీ, తమిళం, తెలుగుతో పాటు మలయాళంలో కూడా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ చిత్రం అత్యద్భుతమైన సెట్స్‌తో మరియు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 3డిలో విడుదలైన తొలి కన్నడ సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమా చాలా వరకు ప్రేక్షకుల అంచనాలను అందుకొని వారి ఆదరణ పొందింది. అంతే కాకుండా నిర్మాతలకు కూడా లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం అనూహ్యంగా లాభదాయకమైన వ్యాపారం జరుపుకుంది. విక్రాంత్ రోణ ఇప్పుడు ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో సెప్టెంబర్ 2 నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

మరో వైపు వాంటెడ్ పండుగాడ్ అనేది యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రయత్నించినా చివరికి ఒక సిల్లీ కామెడీగా తయారైన సినిమా. నిజానికి టాలీవుడ్‌లోని చాలా మంది ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రంలో ఉండటంతో ఈ చిత్రం ఖచ్చితంగా ఒక కామెడీ పండుగలా ఉంటుందని అందరూ భావించారు, కానీ తీరా సినిమా చూస్తే అసలు ఏమాత్రం భరించలేని ఒక భయంకరమైన అతి జుగుప్సాకరమైన సినిమాగా మారింది. ఈ చిత్రంలో సునీల్, శ్రీనివాసరెడ్డి, అనసూయ, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఆమని, తనికెళ్ళ భరణి, విష్ణు ప్రియతో పాటు ఇతర ప్రముఖ కామెడీ/ క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించారు. సెప్టెంబర్ 2 నుంచి ఆహా తెలుగులో వాంటెడ్ పండుగాడ్ ప్రసారం కానుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version