Homeసినిమా వార్తలుఓటీటీలో విడుదలయిన విక్రమ్ కోబ్రా సినిమా

ఓటీటీలో విడుదలయిన విక్రమ్ కోబ్రా సినిమా

- Advertisement -

ఇటీవలే తమిళ సూపర్‌స్టార్‌ చియాన్‌ విక్రమ్‌ నటించిన సినిమా కోబ్రా. ఆగస్ట్‌ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అటు విమర్శకుల నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్‌ రకరకాల లుక్స్‌లో కనిపించే ప్రోమోలను చూసిన ప్రేక్షకులు కోబ్రా సినిమా పై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. 

అయితే సినిమా మాత్రం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక తాజాగా ఈ చిత్రం డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్దమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ సొంతం చేసుకోగా.. డిజిటల్‌ రిలీజ్‌ తేదిను కూడా ప్రకటించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అంటే రేపటి నుంచే కోబ్రా స్ట్రీమింగ్‌ కు అందుబాటులో ఉండనున్నట్లు సోనీ లివ్‌ వెల్లడించింది.

అయితే విడుదలయ్యేది రేపే అయినా కొన్ని గంటల ముందు నుంచే కోబ్రా సినిమా తమ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ట్వీట్ ద్వారా ప్రకటించింది.

READ  ఈ వారం OTTలో విడుదలైన సినిమాల వివరాలు

బాక్సాఫీస్‌ దగ్గర భారీ పరాజయం పాలైన ఈ సినిమా ఊహించినట్టు గానే త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయిన సినిమాలు తొందరగా ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కోబ్రా చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది.

ఈ సినిమాలో విక్రమ్‌ మ్యాథ్స్ లో జీనియస్ అవడంతో పాటు కాంట్రాక్ట్ మర్డర్లు చేసే పాత్రలో నటించారు. అంతే కాకుండా ఏడు భిన్నమైన గేటప్పుల్లో కనిపించారు. అయితే ఇలా డిఫరెంట్ గెటప్లలో కనిపించడం అనేది అపరిచితుడు రోజుల్లో ప్రేక్షకులని ఆకర్షించేది కానీ ఇప్పుడు అది అంతగా ఆకట్టుకునే విషయం కాదనేది విక్రమ్‌ తెలుసుకోవాలి.

READ  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బండ్ల గణేష్ కొత్త సినిమా ఓటిటి విడుదల

కోబ్రా సినిమాలో విక్రమ్‌ సరసన కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నటించరు. ఇక మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విలన్‌గా నటించడం విశేషం. తొలి రోజు కోబ్రా సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో తర్వాతి రోజే 20 నిమిషాల పాటు తగ్గించినా ఫలితం దక్కకుండా పోయింది.

ఇక విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ -1తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం భారీ విజయం సాధించి విక్రమ్ తో పాటు చిత్ర బృందానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories