Homeసినిమా వార్తలువిజయ్ ' వరిసు ' సినిమాకి రికార్డు స్థాయిలో జరుగుతున్న నాన్ థియేట్రికల్ బిజినెస్

విజయ్ ‘ వరిసు ‘ సినిమాకి రికార్డు స్థాయిలో జరుగుతున్న నాన్ థియేట్రికల్ బిజినెస్

- Advertisement -

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ల వరిసు సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో విజయ్ మొదటిసారి తెలుగులో నటించనున్నారు.

ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కథానాయికగా ఎంపికయ్యారు. తన తొలి చిత్రం నుండి ఎక్కువగా హిట్ సినిమాలను అందిస్తూ వచ్చిన రష్మిక.. పుష్ప సినిమా తరువాత మరింత క్రేజ్ ను పెంచుకున్నారు. ఇటీవలే విడుదలై క్లాసికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సీతారామం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో తనదైన శైలిలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

ఇక దిల్ రాజు నిర్మిస్తున్న వరిసు సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఈ ద్విభాషా చిత్రం అధికారికంగా ప్రకటించిన నాటి నుండి ట్రేడ్ వర్గాలలో సంచలనం సృష్టించింది. తద్వారా గొప్ప ఆఫర్‌లను కూడా అందుకుంటుంది.

READ  Box-Office: లైగర్ నష్టాలు తీర్చేదేవరు?

ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను సన్ టీవీ కైవసం చేసుకోగా, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక వరిసు ఆడియో హక్కులను టి-సిరీస్ సొంతం చేసుకుంది. ఈ డీల్స్ వల్ల వరిసు నిర్మాతలకు 115 కోట్ల భారీ మొత్తం రానుండటం విశేషం. ఇక ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ కూడా 150 కోట్ల వరకూ పలకచ్చని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

గత చిత్రం బీస్ట్ భారీ వైఫల్యం చెందిన తర్వాత, విజయ్ తనదైన శైలిలో తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వాలనే కసితో ఉన్నారు మరియు వరిసు ఖచ్చితంగా విజయ్ కు అవసరమైన బ్లాక్ బస్టర్ అందించే సినిమాగా కనిపిస్తుంది. దిల్ రాజు తన ఇటీవలి ఇంటర్వ్యూలలో దర్శకుడు వంశీ పైడిపల్లి పనితనం గురించి పొగుడుతూ.. ఆయన రచించిన స్క్రిప్ట్‌ పై అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. కాగా హీరో విజయ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి విన్న వెంటనే ఓకే చేశారని అగ్ర నిర్మాత తెలిపారు.

READ  మంచి కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడతాయి - చిరంజీవి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories