తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు/వారిసు ఈ ఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం పొంగల్‌కు విడుదలై తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడింది. కాగా ఇప్పుడు, విజయవంతమైన థియేట్రికల్ రన్ తర్వాత, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.
వారిసు చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ రూపంలో ప్రసారం అవుతుంది. ధియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు వారాలకు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయింది.
వారిసు సినిమా అజిత్ యొక్క తునివుతో పాటు విడుదలైంది మరియు ఈ పోటీ ఒక ఆసక్తికరమైన పొంగల్/సంక్రాంతి ఘర్షణను ఏర్పాటు చేసింది. కాగా ఎనిమిది సంవత్సరాల తర్వాత తమిళ అభిమానులు విజయ్ vs అజిత్ పోటీని చూశారు మరియు రెండు చిత్రాలకు కూడా మిశ్రమ సమీక్షలు లభించాయి. అయితే అజిత్ మరియ విజయ్ తమ స్టార్ పవర్ తో పండగ సీజన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలిగారు.
వారిసు ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు మరియు మలయాళంలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను పొందుతుందనే వార్తలు ముందుగానే వెలువడినప్పటికీ, చిత్ర నిర్మాతలు మాత్రం డిజిటల్ ప్రీమియర్ తేదీని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.
జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ మరియు షామ్ కీలక పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో రష్మిక మందన్న విజయ్ సరసన హీరోయిన్ గా నటించారు. థమన్ స్వరపరిచిన ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌కి మంచి స్పందన వచ్చింది. విజయ్ యొక్క వారిసు డిజిటల్ డెబ్యూ కోసం ఇప్పుడు అందరి దృష్టి అమెజాన్ ప్రైమ్ పైనే ఉంది.