తమిళ హీరో విజయ్ తొలిసారి ద్విభాషా(తెలుగు, తమిళ్) చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌కు తెలుగులోనూ మాంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలై అతి కొద్ది రోజుల్లోనే మేజర్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ పోస్టర్‌ను ఆయన ఇటీవల అభిమానులతో పంచుకున్నారు. విజయ్‌తో వంశీ పైడిపల్లి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విజయ్ అభిమానులు ఆ పోస్టర్ ను తెగ వైరల్ చేసారు.
విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “వారిసు” (తెలుగులొ వారసుడు అని అర్థం) అనే టైటిల్ ను ఖరారు చేసారు. ట్విట్టర్ లో హీరో విజయ్ తో పాటు, SVC హ్యాండిల్ ఈ విషయాన్ని ట్వీట్స్ ద్వారా తెలియజేశారు. The Boss Returns అంటూ హీరో విజయ్ పెద్ద వ్యాపార వేత్త అనిపిస్తోంది.ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందాన్న, మెహ్రీన్‌లు నటించనున్నారు. స్వతహాగా యాక్షన్ సినిమాలు ఇష్టపడేవిజయ్ ఈసారి కుటుంబ నేపథ్యం కలిగిన కథలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ సినిమా తరహాలో ఉండచ్చునని కూడా అంటున్నారు.
వరుసగా యాక్షన్, డ్రామా చిత్రాలకే ఓటు వేసే విజయ్ సినిమాతో కాస్త రూటు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న విజయ్ ను చూసి అభిమానులు ఆనందిస్తున్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన ఫ్యామిలీ స్టోరీ విజయ్ కు బాగా నచ్చి వెంటనే విజయ్ ఒకే చెప్పారని తెలుస్తోంది.ఈ చిత్రంలో విజయ్‌తో పాటు ముఖ్య పాత్రల్లో తమిళ నటుడు శరత్ కుమార్,ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ‘కిక్’ శ్యామ్,జయసుధ, మరియు సంగీతశ్రీకాంత్ నటిస్తున్నట్లు తెలిసింది. ‘బీస్ట్’ పరాజయం నేపథ్యంలో విజయ్ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను 2023, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.