Homeసినిమా వార్తలుVijay: వారిసు విషయంలో పూర్తిగా తప్పిన విజయ్ వేసిన లెక్కలు

Vijay: వారిసు విషయంలో పూర్తిగా తప్పిన విజయ్ వేసిన లెక్కలు

- Advertisement -

ప్రస్తుతం విజయ్ నిస్సందేహంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ మరియు తమిళనాడులో మాత్రమే కాకుండా కేరళలో కూడా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. టాక్ తో సంబంధం లేకుండా ఆయన నటించిన చాలా సినిమాలు తమిళంలోనూ, తెలుగులోనూ డబ్బింగ్ అయి విజయం సాధించాయి.

ఇక అదే క్రమంలో ఒక తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాతతో వారిసు/వారసుడు సినిమాకు సంతకం చేయడం ద్వారా ఇది తన తెలుగు మార్కెట్ కు పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన మంచి ప్లాన్ యే వేశారు.

కానీ ఇప్పుడు, ఆయన లెక్కలు తప్పు అయ్యాయి. ముఖ్యంగా వారసుడు ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా బజ్ కు చాలానే డ్యామేజ్ చేసింది. తమిళ నాట ఈ సినిమా కనీసం కొంత బజ్ ను అయినా మోస్తోంది కానీ తెలుగు వెర్షన్ గురించి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

READ  వంశీ పైడిపల్లితో బడ్జెట్ కంట్రోల్ లో పెట్టించడంలో విఫలమవుతున్న దిల్ రాజు

ఇక అది సరిపొదు అన్నట్లు, తమిళ వెర్షన్ రిలీజ్ అయిన 3 రోజుల తరువాత తెలుగు వెర్షన్ విడుదల అవుతుంది. ఈ మొత్తం పరిస్థితి విజయ్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందట. అంతే కాక చిత్ర బృందం పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డట్లు సమాచారం.

వారిసు ఇటీవల సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వద్ద సెన్సార్ కోసం సమర్పించబడింది. ఆ తర్వాత ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ లభించింది. జనవరి 11 న ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధంగా ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగు వెర్షన్ జనవరి 14న విడుదల కానుంది.

రష్మిక మందన్న, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, ఖుష్బూ, యోగి బాబు, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Thunivu: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దక్కించుకోలేకపోతున్న అజిత్ తునివు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories