Homeసినిమా వార్తలునిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న మహేష్ - రాజమౌళి సినిమా

నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న మహేష్ – రాజమౌళి సినిమా

- Advertisement -

RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రాజమౌళి. ఈ తరంలో అతి పెద్ద మాస్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లని ఒకే సినిమాలో అద్భుతమైన కాంబినేషన్ సీన్స్ లో చూపించి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. లాస్ ఏంజిల్స్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డు వేడుకలో ‘RRR’కి అనేక విభాగాల్లో నామినేషన్లు వచ్చేలా దర్శకుడిగా తన పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందెలా రాజమౌళి ప్రయత్నిస్తున్నారు.

RRR వంటి భారీ ప్యాన్ ఇండియా విజయం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు మరియు అతని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యాక్షన్‌-అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథను లాక్ చేసిన రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందనుంది. అయితే యదార్థ సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపొందనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

READ  రెండో వారాంతంలో బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకున్న బ్రహ్మస్త్ర

ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగానే తెరకెక్కనుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ధృవీకరించారు. ఈ వార్త విన్న తర్వాత అటు మహేష్ బాబు అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేమికులు ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రం 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా విడుదల చేయడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

అంతే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ హాలీవుడ్ హీరోల రేంజ్ లో సరికొత్త మేకోవర్ లుక్స్ తో కనిపించనున్నారు.

రాజమౌళి సినిమాల్లో హీరోలు ఎప్పుడూ శారీరకంగా బలంగా ఉంటారు. అందుకే వారి పై వీరోచిత పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం అనేది సులభం అవుతుంది. అదే బాటలో మహేష్ కూడా ఫిజికల్ గా కొత్త మేకోవర్ తో కనిపిస్తారని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది భారీ ఎత్తున ప్రారంభం కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  SSMB28: ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్లనున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories