కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ కి తమిళనాడులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫ్లాప్ మూవీస్ కూడా అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇక మన తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విజయ్ కి పర్వాలేదనిపించే క్రేజ్ ఉంది.
ఇక ఆయన నుండి మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ లో విప్రేతమైన జోష్ నెలకొని ఉంటుంది. ఇక తాజాగా వెంకట్ ప్రభు తో విజయ్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. దీనిని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీగా నిర్మిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అర్చన కలపతి మాట్లాడుతూ, ఈ తమ మూవీ యొక్క బడ్జెట్ రూ. 400 కోట్లు కాగా అందులో రూ. 200 కోట్లు విజయ్ రెమ్యునరేషన్ అని అన్నారు. దీనితో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విజయ్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుండడం నిజంగా షాకింగ్ అని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ది గోట్ మూవీతో విజయ్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.