కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈమూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ విజయ్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈమూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, స్నేహ, లైలా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈమూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.
ఇక తమ మూవీని సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క రిలీజ్ వాయిదా పడిందని, మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కొంత బ్యాలన్స్ ఉండడమే దీనికి కారణం అంటున్నారు. అలానే అతి త్వరలో GOAT మూవీ టీమ్ సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్సు చేయనుందట.