కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ మూవీ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
విజయ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న GOAT మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, పలు ప్రాంతాల్లో ఈ మూవీ భారీగా బిజినెస్ జరుపుకుంది. ముఖ్యంగా గతంలో విజయ్ నటించిన లియో ని మించి మన రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ సహా అనేక ప్రాంతాల్లో దీనికి బిజినెస్ జరిగింది.
కేరళలో లియో రూ. 16 కోట్లు బిజినెస్ చేయగా GOAT మూవీ రూ. 17 కోట్ల బిజినెస్ జరుపుకుంది. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ బిజినెస్ ని బట్టి చూస్తే స్టార్డం పరంగా ఇది హీరో విజయ్ కి ఒకరకంగా ఛాలెంజ్ అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దర్శకుడు వెంకట్ ప్రభు సహా మూవీ టీమ్ మొత్తం కూడా సక్సెస్ పై ఎంతో నమ్మకంగా ఉన్నాయట. మరి రిలీజ్ అనంతరం ఈ ప్రతిష్టాత్మక మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.