కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ మూవీలో స్నేహా, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా యెజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై అర్చన కలపతి ఈమూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
రేపు గోట్ మూవీ గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల గోట్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కి పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక గోట్ మూవీ ప్రీ రిలీజ్ పరంగా బాగానే బిజినెస్ చేసింది. తమిళనాడులో ఈ మూవీని దాదాపుగా అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ మూవీ యొక్క బ్రేకీవెన్ డీటెయిల్స్ క్రింద ఇవ్వడం జరిగింది.
తమిళనాడు – రూ.75 కోట్లు
ఆంధ్రప్రదేశ్ – రూ. 14 కోట్లు
తెలంగాణ – రూ.8 కోట్లు
కేరళ – రూ. 17 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియన్ – రూ. 20 కోట్లు
ఓవర్సీస్ – రూ. 53 కోట్లు
మొత్తంగా అన్ని ఏరియాలు కలుపుకుని గోట్ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 187 కోట్ల బిజినెస్ జరిగింది. కాగా ఈ మూవీ రూ. 400 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ రాబడితే ఇది బ్రేకీవెన్ ని దాటే అవకాశం ఉంది. ఇక గోట్ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్, అలానే శాటిలైట్ రైట్స్ ని జీ నెట్వర్క్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు.