Home సినిమా వార్తలు Vijay GOAT 100 Crores Pre Sales విజయ్ ‘గోట్’ : రూ. 100 కోట్ల...

Vijay GOAT 100 Crores Pre Sales విజయ్ ‘గోట్’ : రూ. 100 కోట్ల ప్రీ సేల్స్

goat

ఇలయదళపతి విజయ్ నుండి మూవీ వస్తుంది అంటే తమిళనాడు లో ఆయన ఫ్యాన్స్ కి అలానే ఆడియన్స్ కి పెద్ద పండుగే అని చెప్పాలి. ఇక తాజాగా వెంకట్ ప్రభు తో విజయ్ చేస్తున్న గోట్ మూవీ సెప్టెంబర్ 5న అనగా రేపు గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్ నటించారు. ఈ మూవీని ఏజిఎస్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కలపతి భారీ స్థాయిలో నిర్మించగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. అయితే గోట్ మూవీ సాంగ్స్ కానీ, ట్రైలర్ గాని పెద్దగా ఆకట్టుకోలేదు, మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ రూ. 100 ప్రీ టికెట్ సేల్స్ కి చేరుకుంటోంది.

గతంలో విజయ్ నటించిన లియో మూవీ రూ. 100 కోట్లకు పైగా ప్రీ సేల్స్ జరుపుకుని టాప్ లో నిలిచింది. ఇక ప్రస్తుతం పరిస్థితిని చూస్తే గోట్ దాని తరువాత స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ పై విజయ్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఉన్నారు. మరి రిలీజ్ అనంతరం గోట్ ఎటువంటి టాక్ ని ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version