Homeసినిమా వార్తలుతెలుగు బాక్సాఫీస్ వద్ద తమ హీరో స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటున్న విజయ్ అభిమానులు

తెలుగు బాక్సాఫీస్ వద్ద తమ హీరో స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటున్న విజయ్ అభిమానులు

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులు తమ స్టార్ యొక్క తెలుగు బాక్సాఫీస్ సామర్థ్యాన్ని ఉన్న దాని కంటే ఎక్కువగా అంచనా వేయడం ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ధోరణిలో వెళ్తున్నారు. తమ హీరో సినిమా ఇప్పుడు తెలుగులోనూ సంక్రాంతికి విడుదల కానుండడంతో మరో ఇద్దరు తెలుగు పెద్ద హీరోల సినిమాలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలపై విజయ్ అభిమానులంతా విమర్శలు గుప్పిస్తున్నారు.

కొంత మంది అత్యుత్సాహంతో ఉన్న అభిమానులు మెగాస్టార్ మరియు బాలకృష్ణలను కూడా ట్రోల్ చేస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా దిల్ రాజు వారిసు/వారసుడు చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య సినిమాలకు పోటీగా ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల కానుంది.

2019లో రజినీకాంత్ నటించిన పెట్టా సినిమా విడుదల సందర్భంగా, సంక్రాంతి రేసులో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన విధానాలు మారాయి. సంక్రాంతికి తానే స్వయంగా తమిళ సినిమాని నిర్మించి దాని డబ్బింగ్ వెర్షన్ ను తెలుగులో విడుదల చేస్తున్నారు.

READ  ఆటో ఇమ్యూన్ కండీషన్ తో బాధ పడుతున్న సమంత

దిల్ రాజు విరుద్ధమైన ప్రకటనలు మరియు చర్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దిల్ రాజు గతంలో చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా వారసుడు కోసం మంచి సంఖ్యలో థియేటర్లను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనికి సంబంధించి విజయ్ అంటే మెగా, నందమూరి అభిమానులు భయపడుతున్నారని విజయ్ అభిమానులు ఒక అసత్య కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు బాలయ్య బాక్సాఫీస్ స్టామినా స్థాయికి తమ హీరోని ఎలివేట్ చేస్తూ ఓ అడుగు ముందుకేస్తున్నారు.

నిజానికి విజయ్‌కి తెలుగులో ఇంతవరకు పెద్ద బ్లాక్‌బస్టర్ లేనే లేదు. తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ లేదా కాంతార వంటి సినిమాల స్థాయిలో విజయ్ సినిమాలేవీ ఇక్కడ కలెక్షన్లు రాబట్టలేదు. పండగ సీజన్లలో విడుదలైనప్పటికీ ఆయన సినిమాలు ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే పొందాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా విజయం సాధించిన విజయ్ చిత్రం 10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా విజయ్ అభిమానులు చేస్తున్న ఈ పని తమాషాగా కాకుండా అహంకారంతో కూడిన ప్రవర్తనగా నిలుస్తుంది.

READ  బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరహాలో ఇతర భాషల్లో రాణించలేకపోయిన పొన్నియిన్ సెల్వన్

తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్లు రావాలని నిర్మాతల మండలి కూడా నిర్మాత దిల్ రాజుకు సలహా ఇచ్చింది. విజయ్ అభిమానులు కూడా సామరస్యం మరియు పరస్పర గౌరవాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా సీనియర్ హీరోలని తగిన విధంగా గౌరవం ఇవ్వాలి. దళపతి విజయ్ కూడా తెలుగు సీనియర్ నటులకు ఎనలేని గౌరవం ఇస్తారు. అభిమానులు తమ హీరో ప్రవర్తన నుండి ప్రేరణ పొంది వారి జీవితంలో కూడా అనుసరించాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories