యువ సంచలనం.. రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ మాస్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించారు.
ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాది ఏరియాలతో పాటు ఓవర్సీస్ బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం విజయ్ దేవరకొండ స్టార్ డం వల్ల ఇది సాధ్య పడిందని చెప్పవచ్చు. యూత్ లో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. అందుకే బుకింగ్‌లు చాలా వేగంగా హౌజ్ ఫుల్ గా నమోదు అవుతున్నాయి. ఇది చిత్ర యూనిట్ ను ఎంతగానో ఉత్సాహపరిచింది. కేవలం హైదరాబాద్ బుకింగ్స్ తోనే రూ. 3 కోట్ల గ్రాస్‌ను దాటడం విశేషం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం విజయ్ మరియు పూరి కెరీర్‌లో బెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధిస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఒకప్పుడు సినిమా థియేటర్లలో విడుదల అయిన ఆరు నెలల తర్వాత కానీ టీవీలలో ప్రసారం అయ్యేవి కావు. కానీ ఓటిటి లు వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు కొన్ని సినిమాలు నేరుగానే ఓటిటిలో విడుదల అవడం ఒక సాధారణ విషయంగా మారింది. ఇక ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులు ఒక సినిమాను ధియేటర్ లో చూస్తున్నపుడు ఆ సినిమా ఏ ఓటిటీ ప్లాట్ ఫారం లో వస్తుందో తెలుసుకోవాలని ఆశ పడుతున్నారు.
తాజాగా ఈరోజు విడుదలైన లైగర్ చిత్రం తాలూకు OTT స్ట్రీమింగ్ భాగస్వామిని ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను భారీ ధరకు పొందిందని సమాచారం. అయితే ఎన్ని రోజుల తరువాత ఓటిటిలోకి అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియ రాలేదు. అక్టోబర్ 5న విడుదల కావచ్చని కొన్ని వార్తలు వచ్చాయి. మరి నిజమో కాదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
ఈ పాన్ ఇండియా మూవీలో బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్, రమ్య కృష్ణన్, విషు రెడ్డి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యధిక హైప్ తో విడుదలైన లైగర్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.