Home సినిమా వార్తలు Kushi: విజయ్ దేవరకొండ – సమంత ల ఖుషి సినిమా విడుదల తేదీ ఖరారు

Kushi: విజయ్ దేవరకొండ – సమంత ల ఖుషి సినిమా విడుదల తేదీ ఖరారు

విజయ్ దేవరకొండ మరియు సమంత నటిస్తున్న ఖుషి ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ నుండి అత్యంత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుంచే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ సంచలనం సృష్టించింది. విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరినీ జంటగా చూడటానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు మరియు ఇప్పుడు,ఈ చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది.

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మరియు సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అప్‌డేట్‌ను అందమైన పోస్టర్‌తో వారు పంచుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

https://twitter.com/Samanthaprabhu2/status/1638835832118231040?t=p16xCGTqVo9W0ghFsgcHZA&s=19

ఇది పాన్-ఇండియా చిత్రం కానప్పటికీ, చిత్రీకరణ మాత్రం భారీ స్థాయిలో ఉంటుందని మరియు తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని దర్శకుడు శివ నిర్వాణ ధృవీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేస్తున్నారు.

మొదట ఖుషి ని 2022 క్రిస్మస్ విడుదలకు ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా వేయబడింది ఆ తర్వాత మళ్ళీ సినిమా పనులు ఆలస్యం కావడంతో చివరికి సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఈ చిత్రం కొంత ఆలస్యం అయింది అయితే ఇప్పుడు ఆవిడ పూర్తిగా కోలుకున్నారు మరియు మార్చి మొదటి వారం నుండి నిరంతరంగా డేట్లు కూడా కేటాయించారు. ఆ రకంగా చిత్ర యూనిట్ ఈ సినిమా చిత్రీకరణను వేగవంతం చేయగలిగింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version