Homeసినిమా వార్తలుఓటిటి విడుదలకు సిద్ధమైన లైగర్ సినిమా

ఓటిటి విడుదలకు సిద్ధమైన లైగర్ సినిమా

- Advertisement -

రౌడీ స్టార్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా “లైగర్”. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏకగ్రీవంగా తిప్పికొట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లను తీవ్రంగా నష్ట పోయేలా చేసింది.

థియేట్రికల్ రిలీజ్ లో ఘోర పరాజయం చవిచూసిన ‘లైగర్’ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఇక ‘లైగర్’ సినిమా నాలుగు దక్షిణాది భాషల్లో డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందట. ఈ గురువారం అర్ధరాత్రి నుంచి తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్ లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. అయితే హిందీ వెర్షన్ కి సంబందించిన డిజిటల్ హక్కులు కూడా హాట్ స్టార్ వద్దే ఉన్నాయి. కానీ హిందీ వెర్షన్ మాత్రం కొద్ది రోజుల తర్వాత ప్రసారం అవుతుందని అంటున్నారు.

READ  లైగర్ సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు - వరంగల్ శ్రీను

‘లైగర్’ సినిమాకు భారీ ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం. తెలుగు – హిందీతో పాటు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలూ కలిపి ఒకేసారి కొనుగోలు చేయడం వలన లాభాలు బాగానే గిట్టిబాటు అయ్యాయట. ఇక శాటిలైట్ రైట్స్ ను స్టార్ గ్రూప్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

ఈ మధ్య సినిమాలు ధియేటర్లలో ఎలాంటి ఫలితం వచ్చినా.. ఆయా సినిమాలు OTTలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఎందుకంటే ఎలాగూ తొందరగానే OTT ప్లాట్ఫారంలో, మొబైల్ ఫోన్లలో సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కాబట్టి, ఒక వర్గం ప్రేక్షకులు ధియేటర్లలో సినిమాలు చూడటం తగ్గించేశారు.

‘లైగర్’ సినిమా విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ ఇద్దరూ ఎంతో కష్టపడి కలగన్న సినిమా. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రంలో ఎంఎంఏ ఫైటర్ గా కనిపించడానికి విజయ్ దేవరకొండ శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. తన కెరియర్ యే ముగిసిపోయే తరహాలో ఆమె పాత్ర మరియు నటనకు తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అలాగే ప్రఖ్యాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ పాత్ర కూడా ఏమాత్రం బాగోలేదని, ఆయన స్థాయికి తగ్గ పాత్ర కాదని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్ – ఛార్మీ కౌర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం సునీల్ కశ్యప్, తనిష్ బక్చితో సహా పలువురు సంగీత దర్శకులు పని చేశారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కెచా యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు.

READ  ఛార్మికి కౌంటర్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories