సాధారణంగా సినీ పరిశ్రమలో టాలెంట్ తో పాటు అదృష్టం, అవకాశాలు కూడా హీరో, హీరోయిన్, దర్శకుల కెరీర్ లో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక హీరోతో సినిమా ప్లాన్ చేసినా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే హీరో మారిపోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విషయంలో కూడా జరిగింది.
విజయ్ గతంలో మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి 2019లో విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే ఈ నిర్మాణ సంస్థ నుంచి మరో సినిమా ఆఫర్ చేసినట్లు అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందుతొంది.
మైత్రీ మూవీస్ మొదట విజయ్ దేవరకొండతో అమీగోస్ తీయాలని అనుకున్నా ఈ అర్జున్ రెడ్డి స్టార్ డియర్ కామ్రేడ్ స్క్రిప్ట్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారట. అందుకే ఆయన ఈ ప్రాజెక్టుకు నో చెప్పగా.. ఇక నిర్మాతలు కూడా ఆయన కోరిక మేరకు ముందుకు సాగారు.
ఆ తర్వాత అమిగోస్ స్క్రిప్ట్ మరి కొంత మంది హీరోల వద్దకు వెళ్లగా చివరికి అది నందమూరి కళ్యాణ్ రామ్ కు నచ్చడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాకి రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాధ్యత వహించారు. కాగా అమిగోస్ చిత్రంతో కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.