రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ఆయన చేస్తున్న స్పై యాక్షన్ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
దీనిని గ్రాండ్ లెవెల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మొదటి నుండి ఎన్నో అంచనాలు ఉన్నాయి.
విషయం ఏమిటంటే, నేడు ఈమూవీ నుండి విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆ పోస్టర్ ద్వారా తెలిపారు. అలానే ఈ నెలలోనే మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు. మరి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈమూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.