Home సినిమా వార్తలు లైగర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్న విజయ్ దేవరకొండ

లైగర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్‌కి ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు విజయ్ కు ఈ స్టార్ స్టేటస్‌ని తెచ్చిపెట్టాయి. అయితే అప్పటి నుంచి ఆయనకు కథల ఎంపికలో సమస్యలు మొదలయ్యాయి.

లైగర్ తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారింది. మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించాలని ప్రయత్నించగా.. లైగర్ సినిమా దారుణంగా విఫలమయింది. కాగా ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ సరైన స్క్రిప్ట్ ను ఎంపిక చేయలేడేమో అనే అనుమానం అందరికి కలిగించింది.

అలాంటి విచిత్రమైన స్క్రిప్ట్‌ పై విజయ్ దేవరకొండ చాలా నమ్మకంగా ఉండటమే అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతే కాకుండా ఒకానొక సమయంలో లైగర్ సినిమాకి సీక్వెల్ కూడా తీయాలనుకున్నారు. అయితే సినిమా ఫలితం తరువాత విజయ్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది.

లైగర్ డిజాస్టర్ విజయ్ తన కథల ఎంపికలను విశ్లేషించేలా చేసింది. విజయ్ తన భవిష్యత్ సినిమాలుగా ఏవి చేయాలనే విషయంలో డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హరీష్ శంకర్, పరశురామ్, బుచ్చిబాబు తదితర చాలా మంది దర్శకులను తన వెయిటింగ్ లిస్టులో ఉంచుకున్నారు.

స్టార్ హీరోలకు ఇలాంటి సమస్యలు కొత్త కాదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజాలు కూడా హిట్లర్ సినిమాకి ముందు ఫెయిల్యూర్స్ వెనుక ఉన్న లోపాలను విశ్లేషించడానికి సమయం తీసుకున్నారు. మహేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. మరియు అలాంటి పరిస్థితుల నుండి బలంగా బయటపడ్డారు. ఏ హీరో అయినా తిరిగి పుంజుకోవడానికి ఇటువంటి పునరాలోచన అవసరం.

విజయ్ దేవరకొండకు కూడా అలాంటి ఒక్క కమ్ బ్యాక్ సినిమా చాలు మళ్ళీ కెరీర్ సరిద్దుకుంటుంది. ఇక అలాంటి ఉత్తమ ఫలితాల కోసం విజయ్ సెన్సిబిలిటీస్ కు అనుగుణంగా ఉంటూనే మాస్ ఎలిమెంట్స్‌ కలిపి ఉన్న సినిమా చేస్తే మంచిది. మరి ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయగల దర్శకుడితో ఆ దిశగా విజయ్ అడుగులు వేస్తారని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version