Homeసినిమా వార్తలువిజయ్ - అట్లీ కాంబినేషన్లో భారీ ప్యాన్ ఇండియా సినిమా

విజయ్ – అట్లీ కాంబినేషన్లో భారీ ప్యాన్ ఇండియా సినిమా

- Advertisement -

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ వరుస సినిమాలని ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో వరిసు అనే సినిమా చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా దిల్ రాజు చెప్తున్న దాని ప్రకారం ఈ కథ విని విజయ్ ఆశ్చర్యపోయారట.. అందుకే వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.

వంశీ పైడిపల్లి సినిమా తర్వాత విజయ్ చేస్తున్న సినిమాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అయన తదుపరి చిత్రం తనతో ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్నారు. ఇటీవలే కమల్ హాసన్ తో విక్రమ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్, గౌతమ్ మీనన్ లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయిన విజయ్-అట్లీ కలయికలో మరో సినిమా పట్టాలెక్కనుంది. వీరిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ ఇదివరకు తేరి, మెర్సల్ మరియు బిగిల్ వంటి సూపర్‌హిట్‌లను అందించారు. మరియు ఆ విజయాన్ని నాల్గవసారి కూడా పునరావృతం చేయాలని చూస్తున్నారు. దర్శకుడు అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా పనులు అన్నీ ముగించుకుని విజయ్‌తో తిరిగి జత కట్టడానికి కొంత సమయం పడుతుంది.

READ  పూరి తప్పుడు నిర్ణయం వల్ల కోట్లు నష్టపోయిన ఛార్మీ

కాగా విజయ్ – అట్లీల కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ఏకంగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. తేండాల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ మరియు అట్లీ ఇద్దరూ 2023 ప్రథమార్థం వరకు తమ కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఎన్టీఆర్ కావాలనే కొరటాల శివ సినిమాని ఆలస్యం చేస్తున్నారా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories