కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా అర్జున్ సర్జా, రెజీనా ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ విడాముయార్చి. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభస్కరన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అనిరుద్ స్వరాలు సమకూర్చారు.
ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిశ్రమ స్పందన ను ఆడియన్స్ నుండి అందుకుంది. ఇక ఫస్ట్ డే అజిత్ స్టార్డం తో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన విడాముయార్చి మూవీ రెండవ రోజు ఆశించిన స్థాయి కలెక్షన్ అయితే అందుకోలేకపోయినప్పటికీ వీకెండ్ కావడంతో నిన్న నేడు బాగానే రాబడుతోంది.
యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన ఈ మూవీలో కథ కథనాలు ఇంట్రెస్టింగ్ గా లేవు. అయితే అజిత్ యాక్టింగ్ కి మంచి మార్కులు పడుతున్నాయి. ఇక తమిళనాడులో రూ. 53 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 32 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 12.5 కోట్లు అందుకుంది.
ఇదంతా కలిపి మొత్తంగా వరల్డ్ వైడ్ రూ. 97.5 కోట్లు సొంతం చేసుకుంది. ఇక ఈ రోజుతో విడాముయార్చి మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంత మేర రాబడుతుందో చూడాలి.