కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడాముయార్చి. నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. తెలుగులో దీనిని పట్టుదల టైటిల్ తో రిలీజ్ చేసారు.
యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన ఈ మూవీలో అర్జున్, రెజీనా తో పాటు నిఖిల్ నాయర్, ఆరవ్, జీవ రవి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ సంగీతం సమకూర్చాడు. అయితే టీజర్, ట్రైలర్ పరంగా పెద్దగా ఆకట్టుకోని ఈ మూవీ సాంగ్స్ కూడా మిక్స్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
ఇక నేడు రిలీజ్ అయిన మూవీలో అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. ఆయన నుండి ఆశించిన స్థాయి అవుట్ ఫుట్ ఏమాత్రం లేకపోవడం తో అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం అనిరుద్ పై సోషల్ మీడియా మాధ్యమాల్లో విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇటీవల విజయ్ తో చేసిన మూవీస్ అలానే ఎన్టీఆర్ తో తాజాగా చేసిన దేవర మూవీ సహా అన్నిటికీ సాంగ్స్ తో పాటు బీజీఎమ్ అదరగొట్టాడు అనిరుద్. కానీ విడాముయార్చి విషయంలో మాత్రం ఆయన పనితనం పిలవడంగా ఉండడంతో తదుపరి అజిత్ తో ఆయన చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లి విషయంలో అయినా పూర్తి జాగ్రత్త తీసుకోవాలని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.