కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ విడాముయార్చి. ఈ మూవీలో అర్జున్, రెజీనా కీలక పాత్రలు చేయగా అనిరుద్ సంగీతం సమకూర్చారు. భారీ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ మూవీ తెలుగులో పట్టుదల టైటిల్ తో డబ్ చేయబడింది.
ఇక ఆశించిన స్థాయిలో అయితే కలెక్షన్ అందుకోలేకపోయిన ఈ మూవీ ఓవరాల్ గా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ కె ఈ మూవీ ఆల్మోస్ట్ బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ. 130 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. మొత్తంగా చూస్తే ఫుల్ రన్ లో రూ. 150 కోట్లకు మించి దక్కించుకునే అవకాశం లేదు.
ఇటీవల వచ్చిన అజిత్ మూవీ తునీవు కంటే ఇది చాలా చాలా తక్కువ. రిలీజ్ కి ముందు కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొన్న ఈ మూవీ ఫస్ట్ డే టాక్ మిక్స్డ్ గా అందుకుంది. అయితే అజిత్ స్టార్ పవర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి పనిచేసినప్పటికీ, మూవీ కంటెంట్ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో అన్నివిధాలా దెబ్బ పడి డిజాస్టర్ గా మిగిలింది.