తల అజిత్ కుమార్ హీరోగా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్ మూవీ విడాముయార్చి. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా కాసాండ్రా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ మూవీ పై కొంత క్రేజ్ పెంచింది.
అజిత్ ఫ్యాన్స్ అయితే తమ హీరో మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా నేడు భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క ఎర్లీ షోస్ ద్వారా వస్తున్న టాక్ బాగానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్లో గా సాగగా, ఇంటర్వ్యూ ఎపిసోడ్ బాగుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా ఆశించిన స్థాయిలో లేదని, అక్కడక్కడా కొన్ని సీన్స్ సాగదీసినట్లు ఉన్నాయని అంటున్నారు.
ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదని, ట్విస్టులు కూడా ఆశించిన స్థాయిలో లేవని చెప్తున్నారు. అలానే అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గా లేదని, ఓవరాల్ గా కేవలం హీరో అజిత్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్తున్నారు. మరి నేటి నుండి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఓవరాల్ ఎంతమేర మేర వారిని మెప్పించి ఆకట్టుకుంటుందో చూడాలి.