కోలీవుడ్ స్టార్ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల సూర్య తో జై భీం వంటి భారీ సక్సెస్ఫుల్ సినిమా తీసిన టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ వేట్టయాన్.
ఇటీవల జైలర్ తో అత్యద్భుత విజయం సొంతం చేసుకుని కెరీర్ పరంగా మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్ రజినీకాంత్, దీనితో కూడా పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు వేట్టయాన్ టీమ్.
అలానే రజిని ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాసిల్ తదితరులు నటించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో రూపొందిన వేట్టయాన్ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది..
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన వేట్టయాన్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.