కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయాన్. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా అత్యధిక వ్యయంతో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక వేట్టయాన్ మూవీ యొక్క డే 1 ప్రీ బుకింగ్స్ గుడ్ స్టార్ట్ తో ప్రారంభం అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే ఇండియాలో రూ. 13 కోట్ల మేర ప్రీ బుకింగ్స్ నుండి ఈ మూవీ రాబట్టింది. అందులో 60% తమిళనాడు నుండి రాగా ఓవర్సీస్ లో 1.75 మిలియన్స్ బుకింగ్స్ జరిగాయి.
ఆ విధంగా చూస్తే ఓవరాల్ గా వేట్టయాన్ మూవీ రూ. 28 కోట్లు డే 1 ప్రీ బుకింగ్స్ నుండి రాబట్టింది. అలానే డే 1 ఈ మూవీకి రూ. 70 కోట్ల వరకు ఓపెనింగ్ కలెక్షన్ లభించే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన రజినీకాంత్ వేట్టయాన్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.