సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జై భీం మూవీ ఫేమ్ టీజె జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయన్. కాగా ఈ క్రేజీ కాంబో మూవీ పై మొదటి నుండి రజిని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో మంజువారీయర్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాసిల్, రానా దగ్గుబాటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈమూవీలో ఆథియన్ అనే పవర్ఫుల్ ఎన్కౌంటర్ స్పెషల్ పాత్రలో రజినీకాంత్ అద్భుతంగా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ తమిళనాడులో బాగానే ఆడుతుండగా తెలుగులో పర్వాలేదనిపించే స్థాయిలో కోనసాగుతోంది.
ఇక ఈ మూవీ మొదటి రోజు రూ. 38 కోట్లు, రెండవ రోజు రూ. 28 కోట్లు, మూడవ రోజు రూ. 32 కోట్లు, అలానే నాలుగవ రోజు రూ. 25 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇండియాలో వేట్టయన్ మూవీ రూ. 123 కోట్లని, వరల్డ్ వైడ్ గా రూ. 185 కోట్లని రాబట్టింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. కాగా వేట్టయన్ మూవీ బ్రేకీవెన్ ని అందుకోవాలంటే మొత్తంగా రూ. 325 కోట్లు అందుకోవాలి.