ఈ ఏడాది వేసవిలో ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ దగ్గుబాటి తన 75వ చిత్రం సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు విడుదలైంది, ఇందులో వెంకటేష్ ఇంటెన్స్ న్యూ లుక్ లో కనిపించనున్నారు. ఈ వీడియోకు అటు అభిమానులు, ఇటు విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
వెంకటేష్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అయిన వెంకీ75ను ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.
హిట్ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో చివరిసారిగా కనిపించిన వెంకటేష్ ఈ సినిమా ఫస్ట్ లుక్ లో పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు.
గడ్డంతో డైనమిక్ లుక్ లో చేతిలో మందుతో చంద్రప్రస్థ అనే నగరంలోకి తుపాకీతో వెంకటేష్ ప్రవేశించడం మనం ఈ గ్లింప్స్ లో చూడవచ్చు. ఫైట్స్, బ్లాస్ట్స్, బ్లడ్ తో తెరకెక్కిన సైంధవ్ ఫస్ట్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సినిమా నుంచి ఏం ఆశించవచ్చో సరిగ్గా అర్థం అయ్యేలా ఈ గ్లింప్స్ ను రూపొందించారు. కాగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు.
అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు కానీ 2023 ద్వితీయార్ధంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటించనున్నారని, అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.