Homeసినిమా వార్తలుVenkatesh Many Movies Lineup Ready విక్టరీ వెంకటేష్ వరుస మూవీస్ లైనప్ రెడీ

Venkatesh Many Movies Lineup Ready విక్టరీ వెంకటేష్ వరుస మూవీస్ లైనప్ రెడీ

- Advertisement -

ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడితో విక్టరీ వెంకటేష్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. 

భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించింది. ఓవరాల్ గా రూ. 300 కోట్ల పైచిలుకు గ్రాస్ ని అలానే రూ. 150 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ. 

ముఖ్యంగా ఈ మూవీలో వెంకటేష్ కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీకి ఇంత పెద్ద సక్సెస్ అందించాయి. ఇక ఈ మూవీతో సీనియర్ స్టార్ హీరోల్లో అత్యధిక కలెక్షన్ అందుకున్న హీరోగా నిలిచారు విక్టరీ వెంకటేష్. కాగా దీని అనంతరం వరుసగా పలువురు దర్శకులు వెంకీతో మూవీస్ చేసేందుకు క్యూ కడుతున్నట్లు టాక్. 

ఇప్పటికే ఆయన కోసం పలువురు దర్శకులు కథలు రెడీ చేస్తున్నారట. ఇటీవల కిషోర్ తిరుమల, తాజాగా తాజాగా కొరటాల కథలతో వెంకీని సంప్రదించారట. మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా వెంకటేష్ కలిశారు. కాగా వీరిద్దరి మీట్ లో వెంకీ కి సురేందర్ ఒక స్టోరీ లైన్ వినిపించారట. 

అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు వెంకటేష్ మరియు మరొక యంగ్ హీరోతో కలిసి ఒక మల్టీస్టారర్ కథ కోసం అప్రోచ్ అవ్వబోతున్నారని సమాచారం. కాగా వీటిలో ఏవేవి ఫైనల్ అవుతాయో చూడాలి.

READ  Marco to Stream in another OTT Also మరొక ఓటిటిలో కూడా స్ట్రీమ్ కానున్న 'మార్కో'

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories