Home సినిమా వార్తలు Venkatesh Maha: క్షమాపణలు చెప్పినా కానీ.. ఇప్పటికీ కమర్షియల్ సినిమా గురించి తన మాటలకు...

Venkatesh Maha: క్షమాపణలు చెప్పినా కానీ.. ఇప్పటికీ కమర్షియల్ సినిమా గురించి తన మాటలకు కట్టుబడి ఉన్నానన్న వెంకటేష్ మహా

దర్శకుడు వెంకటేష్ మహ ఇటీవల కేజీఎఫ్ 2 గురించి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు వివిధ వర్గాల సినీ ప్రేమికుల నుండి తీవ్ర విమర్శలను లాగడంతో పెద్ద వివాదానికి కేంద్రంగా మారారు. గత రాత్రి, వెంకటేష్ మహా తన వ్యాఖ్యలను స్పష్టం చేస్తూ కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. మరియు భాషా వినియోగానికి క్షమాపణలు కూడా చెప్పారు.

అయితే, ఈ C/o కంచరపాలెం దర్శకుడు కేజీఎఫ్ 2 సినిమా పై మరియు సినిమాలోని పాత్రల పై తన అభిప్రాయాలు మాత్రం అలాగే ఉంటాయని పేర్కొన్నారు. ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించినట్లు తెలిపారు. ఆ వీడియోలను పోస్ట్ చేయడానికి తన సోషల్ మీడియా ఖాతాని ఆయన ఉపయోగించుకున్నారు.

వెంకటేష్ తనకు కేజీఫ్ 2 పట్ల ఇతరులతో పోలిస్తే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అలాగే తాను చేసిన వ్యాఖ్యలు సినిమా క్యారెక్టర్ గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కాదని అన్నారు. తనతో పాటు చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కూడా చెప్పారు. తన విమర్శనాత్మక వ్యాఖ్యలకు మద్దతుగా తనకు అనేక సందేశాలు వచ్చాయని చెప్పారు. తన మాటల ఎంపికకు, వాటిని వ్యక్తపరిచిన తీరుకు మాత్రం చింతిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా, తన భాష మరియు బాడీ లాంగ్వేజ్ ఆధారంగా ప్రజలు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

“నేను ఒక సినిమా క్యారెక్టర్‌ పై కామెంట్స్ చేసినప్పుడు, చాలామంది నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నా ఫోటోలు దుర్వినియోగం చేస్తూ ట్రోల్‌లతో చెడుగా ప్రచారం చేయబడ్డాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాను’’ అని దర్శకుడు వెంకటేష్ మహా అన్నారు. కేజీఫ్ 2 సినిమా నచ్చని చాలా మంది తరపున తాను వాయిస్‌ ఇచ్చానని ఆయన చెప్పారు.

మొత్తం మీద, వెంకటేష్ మహా యొక్క క్లారిఫికేషన్ వీడియో ఒక కవర్-అప్ లాగా ఉంది మరియు ఏదో చెప్పాలి కాబట్టి క్షమాపణ చెప్పినట్టుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక యష్ మరియు ప్రశాంత్ నీల్ అభిమానులకు కూడా ఈ వివరణ పెద్దగా రుచించకపోవచ్చు. ఇంతకు ముందు దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇదే విషయంలో క్షమాపణలు చెప్పగా, ప్రేక్షకులు దాన్ని కూడా ఆమోదించలేదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version