టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా యువ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక కామెడీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.
ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వెంకటేష్, అనిల్ ల కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 పెద్ద హిట్ కాగా ఎఫ్ 3 యావరేజ్ గా ఆడింది. దానితో వారిద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో దీని పై అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.
విషయం ఏమిటంటే, నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ మూవీ నుండి బిటిఎస్ షూట్ వీడియోని రిలీజ్ చేసిన మేకర్స్, తమ మూవీని సంక్రాంతికి వస్తున్నాం అంటూ తెలిపారు. దీనిని బట్టి ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అని తెలుస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఈ క్రేజీ మూవీ ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.