సమ‌్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ ముందుకు వచ్చిన F3 సినిమా, అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను నవ్వించింది.F2 సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా..మొదటి రోజు విమర్శకులు పెదవి విరిచినా .. కలెక్షన్లు అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలోనే రాబట్టింది. మే 27న విడుదలైన ఎఫ్3 సినిమాకు F2 ఫ్రాంచైజ్ ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం విశేషం. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్ ఇతర పాత్రల్లో నటించారు.
అలాగే ఎఫ్3 మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై చిత్ర బృందం ప్రచార సమయంలోనే స్పష్టత ఇచ్చింది.ఈ విషయం మేరకు సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకు హీరోలు వెంకటేష్,వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో ఎఫ్3 సినిమాను థియేటర్లలో చూడకపోయినా, నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తాదిలే అనుకున్నారు కదా’ అని వరుణ్ తేజ్ అడగ్గా.. ‘ఇట్స్ నాట్ కమింగ్ అమ్మా.. నాలుగు వారాల్లో రాదామ్మా.. ఎనిమిది వారాల తరువాతే వస్తుందమ్మా..’ అని వెంకటేష్ బదులు చెప్పినట్టు ఒక సరదా కార్యక్రమం లాగా ఆ వీడియోను ఉపయోగించుకున్నారు.
అయితే ప్రేక్షకులకు ఇచ్చిన మాట మీద F3 చిత్ర యూనిట్ నిలబెట్టుకున్నారు. సరిగ్గా సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు OTTలో F3 సినిమా వస్తుంది. సోనీలైవ్(sonyliv)యాప్ లో జూలై 22న స్ట్రీమింగ్ (streaming)కి సిద్ధంగా ఉంది.