విక్టరీ వెంకటేష్ ఇటీవల యువ దర్శకుడు శైలేష్ కొలను తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. వెంకటేష్ కెరీర్ 75వ మూవీ గా రూపొందిన సైంధవ్ రిలీజ్ అనంతరం పర్వాలేదనిపించేలా మాత్రమే ఆడింది. ఇక దీని అనంతరం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్దమయ్యారు వెంకీ మామ. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా రేపు ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు.
లవ్, ఫన్ తో పాటు ఎమోషనల్, ఫామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కొద్దిసేపటి క్రితం టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
అందంతో పాటు చక్కని అభినయం కూడా చేయగలిగిన ఐశ్వర్యకు ఈ మూవీ మరింత మంచి క్రేజ్ తీసుకువస్తుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక గతంలో వెంకటేష్ తో అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ రెండూ కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరి మూడవ కాంబోలో రూపొందనున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.