బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల అయిన ఈ చిత్రం తర్వాత రేపు చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పోటీని ఎదుర్కోనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేలా అడుగులు వేస్తుంది.
నిజానికి ఈ చిత్రానికి కాస్త మిశ్రమ సమీక్షలు మరియు ప్రీ-ఫెస్టివల్ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు అసాధారణమైన నంబర్లను నమోదు చేసింది. కాగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా షేర్ రూ .30 కోట్ల స్థాయిలో.. గ్రాస్ రూ .45 కోట్ల స్థాయిలో వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అందరూ ఊహించిన దానికంటే చాలా మెరుగైన వసూళ్లు అని చెప్పాలి.
ఈ సంఖ్యలు బాలకృష్ణకు కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ కు దారి తీశాయి. అఖండ ఓపెనింగ్ డేతో పాటు ఓపెనింగ్ వీక్ కలెక్షన్స్ ను కూడా సునాయాసంగా దాటే పనిలో ఉంది వీరసింహారెడ్డి. ఈ మాస్ ఎంటర్ టైనర్ యొక్క ప్రీ-బిజినెస్ విలువ 75 కోట్లు. పండుగ రోజుల్లో సరిగ్గా కలెక్షన్లు సాధించగలిగితే ఈ చిత్రం బ్రేక్ వెన్ మార్క్ సాధించడం సులభం అవుతుంది.
ఈ చిత్రం ఇప్పటికే యుఎస్ఎలో 500 వేల డాలర్ల ప్రీ-సేల్స్ సాధించింది మరియు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఇంతకు ముందు యూఎస్ లో బాలకృష్ణ సినిమాల ప్రదర్శనకు ఇది చాలా భిన్నం అని చెప్పచ్చు.
శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, లాల్ మరియు నవీన్ చంద్ర వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందించారు. కాగా వీరసింహారెడ్డి సినిమాకి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్రశంసించబడింది.