ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. టాలీవుడ్ నుంచి జనవరి 12న వీరసింహారెడ్డి విడులైతే, జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదలైంది. ఇక కోలీవుడ్ లో అజిత్ నటించిన తునివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు జనవరి 11న విడుదలయ్యాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన నాలుగు సినిమాలు మొదటి రోజు మంచి కలెక్షన్లు దక్కించుకున్నాయి అందులో బాలకృష్ణ వీర సింహారెడ్డి ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తొలి రోజు షేర్ 28.63 కోట్ల షేర్ తో సౌత్ ఇండియన్ పొంగల్ కాంపిటీషన్ లో వాల్తేరు వీరయ్య, తునివు, వారిసు లని దాటి బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే షేర్ తెచ్చుకుంది.
ఇక తమిళనాట అజిత్ నటించిన తునివు సినిమానే పైచేయి సాధించగా, ఓవర్సీస్ మార్కెట్ లో మొదటి రోజు కలెక్షన్స్ లో వారిసు అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సంక్రాంతి సినిమాలన్నింటికీ మిశ్రమ సమీక్షలు రాగా, ప్రధాన నటులకు మాత్రం ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఇప్పటికే వారిసు, తునివు, వీరసింహారెడ్డి చిత్రాలు రెండో రోజు కలెక్షన్లలో భారీ డ్రాప్స్ ను చవిచూశాయి. ఇప్పుడు పండగ మొదలైంది కాబట్టి పొంగల్ కు విడుదలయిన ప్రతి సినిమా భవితవ్యాన్ని నేటి ప్రదర్శన నిర్ణయిస్తుంది.
ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో, భారీ పెట్టుబడులు పెట్టిన స్టార్ హీరోల సినిమాలే. మరి వాటి ఖర్చులను తిరిగి పొందడానికి రాబోయే కొన్ని రోజులు నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలన్నింటికీ ఈ రోజు చాలా కీలకమైన రోజు, మరి ఏ సినిమా పండగ వారంతాన్ని ఉపయోగించుకుంటుందో చూడాలి.