యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై మొదటి నుండి విజయ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ సంగీతం సమకూరుస్తుండగా విజయ్ ఒక మాస్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ మార్చి 28న విడుదలకు రెడీ అవుతోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క టైటిల్ టీజర్ ని ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.
కాగా ఈ మూవీకి సామ్రాజ్యం అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొద్దిరోజులుగా టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ గురించిన మరిన్ని అఫీషియల్ అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి